వాజ్‌పేయికి సంతాపం తెలిపిన కేసీఆర్‌..

230
CM KCR
- Advertisement -

భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సపొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Atal Bihari Vajpayee's death

ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్‌గా, ప్ర‌ధానిగా విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌ను న‌డిపి దేశానికే కాక యావ‌త్ ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచిన వాజ్ పేయి మృతి తీర‌ని లోట‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంతకర్త, మంచి వక్త, నిరాడంబరుడు, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేసిన అట‌ల్జీ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

- Advertisement -