పుల్వామా ఉగ్రదాడి అమానుషం:సీఎం కేసీఆర్

283
kcr
- Advertisement -

పుల్వామా ఉగ్రదాడిని ఖండించారు సీఎం కేసీఆర్. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.దేశ కోసం ప్రాణం అర్పించిన జవాన్లకు యావత్ దేశం అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు.అసెంబ్లీలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళి అర్పిస్తు తీర్మాన్ని ప్రవేశపెట్టారు.

పూల్వామా దాడి యావత్ భారతీయుల హృదయాలను కలచివేసిందన్నారు సీఎం కేసీఆర్. మరణించిన 42 మంది సీఆర్‌పీఎఫ్ వీరజవాన్ల ఒక్కొకుటుంబానికి రూ. 25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

తెలంగాణ అసెంబ్లీ అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తుందని తెలిపిన సీఎం కేంద్రం ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.

జవాన్లకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అభినందనీయమన్నారు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క. జవాన్లకు అండగా అందరం నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తున్నామని ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల తెలిపారు. ఈ సమయంలో మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -