కేసీఆర్‌…నాణేలు

249
- Advertisement -

తెలంగాణను సంక్షేమం,అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్‌ యూకే అధ్యక్షుడు సిక్కా చంద్రశేఖర్ గౌడ్‌ ప్రత్యేక నాణేలను తయారు చేయించారు. ఓ వైపు సీఎం కేసీఆర్ చిత్రపటం..మరోవైపు పార్టీ గుర్తు కారు బొమ్మను ముద్రించి ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరింపచేశారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్న కేసీఆర్‌కు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు సిక్కా చంద్రశేఖర్.ఈ నాణేలను సీఎం కేసీఆర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని…ఆయనపై ఉన్న అభిమానంతోనే ఈ నాణేలను తయారు చేశామని చెప్పారు ఎన్నారై టీఆర్ఎస్ కోర్ కమిటీ మెంబర్ సురేష్ గోపతి.కేసీఆర్‌ను కలుసుకోవడం…ఆయన ఎన్నారైల బాగోగులను అడిగి తెలుసుకోవడం గొప్పగా అనిపించింది అన్నారు భాస్కర్.

kcrవివిధ రకాల సంక్షేమ పథకాలతో దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్న ఆయన ఫోటోలకు పాలాభిషేకాలు జరపడం చూస్తునే ఉన్నాం. ఈ క్రమంలోనే కేసీఆర్ మనసులో చిరస్థాయిగా నిలువాలనే ఉద్దేశంతో..ఆయనపై ఉన్న అభిమానంతో కేసీఆర్ నాణేలను ముద్రించారు టీఆర్ఎస్‌ యుకే ఫ్యాన్స్.

- Advertisement -