మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు సవాల్ విసిరారు సీఎం కేసీఆర్. తెలంగాణలో అమలవుతున్న పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తే ఇక్కడికి మళ్లీ రానని సవాల్ విసిరారు. కంధార్ లోహాలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొని మాట్లాడిన సీఎం.. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నాం. పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తున్నాం అని తెలిపారు.
తెలంగాణలో దళిత బంధు అమలు చేస్తున్నాం…. దళిత వజ్రం, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుట్టిన ఈ గడ్డపై దళిత బంధు అమలు చేస్తే రానని ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు. మహారాష్ట్రలో రైతుల సమస్యలు పరిష్కరించండి.. మరోసారి నేను రాను. ఇవన్నీ అమలు చేస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇస్తే.. నేను మహారాష్ట్రకు రావడం మానేస్తాను అని తేల్చిచెప్పారు.
తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకు నేను వస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. మహారాష్ట్రలో దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పీఎం కిసాన్ కింద కేంద్రం కేవలం రూ.6వేలు మాత్రమే ఇస్తుంది. పీఎం కిసాన్ కింద రైతులకు కనీసం రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉల్లి, చెరుకు రైతులు ధరల కోసం ఏటా పోరాడాల్సిందేనా? ఇది రాజకీయ సభ కాదు. బతుకులపై ఆలోచన సభ అన్న సీఎం… యూపీ, పంజాబ్‌లో నేతల మాయమాటలకు మోసపోయాం అన్నారు.
ఇవి కూడా చదవండి..