సీఎం కేసీఆర్ బర్త్ డే..కేబి స్కూల్ ఆవరణలో గ్రీన్ ఛాలెంజ్

502
Kb School
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తుర్కయాంజల్ లోని కేబి స్కూల్ ఆవరణలో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా దాదాపు 500వరకు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిలిం ఇండస్ట్రీ చైర్మన్ రామ్మోహన్ రావు , రాచకొండ డిసిపి దివ్యచరన్ రావ్ , గ్రీన్ ఇండియా కో ఫౌండర్ రాఘవేందర్ , సినిమా ఆర్టిస్ట్ నందకిశోర్ , స్కూల్ ఛైర్మన్ సి ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

Kb School Green

ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. రోజు రోజుకు మారిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టి లో ఉంచుకొని ప్రతి ఒక్కరం మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని అన్నారు. భవిష్యత్ భావిభారతపౌరులైన విద్యార్దులకు మొక్కలు పెంచే ప్రాధాన్యతను వివరించాలని పెద్దలు గా మనం భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించడమే గొప్ప సంపద అని తెలిపారు.

ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం ను పురస్కరించుకుని ఎలాంటి వృధా ఖర్చులు, అంగు ఆర్బాటలు లేకుండా మొక్కలు నాటాలని రాజ్య సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు మా స్కూల్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కిషోర్ గౌడ్, జగన్ మోహన్ గౌడ్, స్కూల్ ప్రిన్సిపాల్ అరుణ రెడ్డి , ఎంపీటీసీ ఏనుగు భరత్ రెడ్డి, స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -