జగన్ గృహప్రవేశానికి హాజరుకానున్న సీఎం కేసీఆర్

241
kcr jagan
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 14న ఆంధ్రప్రదేశ్ కు వెళ్లనున్నారు. దేశంలో గుణాత్మక మార్పుకోసం సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఏపీ ప్రతిపక్ష నేత వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ను కలవనున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో చేరాలంటూ ఇప్పటికే జగన్ తో ఫోన్ లో మాట్లాడారు కేసీఆర్. ఈసందర్భంగా ఈనెల 14న ఏపీలో పర్యటించనున్నారు. కొద్ది రోజుల క్రితం విశాఖ‌లోని శార‌దా పీఠాన్ని దర్శించుకున్న కేసీఆర్ తిరిగి స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి ఆహ్వానం మేర‌కు శార‌దా పీఠానికి వెళుతున్నారు. ఈ నెల 10 నుండి 14 వ తేదీ వ‌ర‌కు ఈ పీఠం లో వార్షికోత్స‌వాలు జ‌రుగుతున్నాయి. 14న జ‌రిగే పూర్ణాహుతి లో కేసీఆర్ పాల్గొంటార‌ని స‌మాచారం. దీని కోసం ఆయ‌న హైద‌రాబాద్ నుండి నేరుగా విశాఖ కు వెళ్లనున్నారు.

మొన్నటి ఎన్నిక‌ల్లో ఘన విజ‌యం త‌రువాత ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు లక్ష్యంగా కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామ‌ని చెప్పుకొచ్చారు. దీంతో..ఏపిలో ఎన్నిక‌ల వేళ‌..కేసీఆర్ విశాఖ‌కు వ‌స్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న ఆస‌క్తి క‌రంగా మారింది. ఏపి రాజ‌ధాని ప‌రిధిలో నూత‌నంగా నివాసం ఏర్ప‌టు చేసుకున్న జ‌గ‌న్ ఈ నెల 14న గృహ‌ప్ర‌వేశం చేయ‌ను న్నారు. 14వ తేదీ ఉద‌యం 8.21 గంట‌ల‌కు జ‌గ‌న్ గృహ‌ప్ర‌వేశ ముహూర్తం.

ఈసందర్భంగా ఈకార్యక్రమానికి సీఎం కేసీఆర్ ను రావాలని ఆహ్వానించారు జగన్. స‌రిగ్గా అదే రోజు విశాఖ శార‌దాపీఠంలో కార్య‌క్రమం కోసం కేసీఆర్ అక్క‌డికి వ‌స్తున్నారు. కొంత కాలంగా జ‌గ‌న్ సైతం స్వ‌రూపానంద సూచ‌న‌ల మేర‌కు రుషికేష్ లో..హైద‌రాబాద్‌లో యాగాలు చేయించారు. విశాఖ‌లో జ‌రిగే కార్య‌క్ర మానికి హాజ‌రు కావాల‌ని జ‌గ‌న్ ను సైతం ఆయ‌న ఆహ్వానించారు. జ‌గ‌న్ ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు విశాఖ కు వెళ్తున్నారు. అక్క‌డే కేసీఆర్ – జ‌గ‌న్ ఇద్ద‌రూ క‌లుసుకోబోతున్నారు.

- Advertisement -