ఆదిత్య ఎల్‌1 ప్రయోగంపై సీఎం కేసీఆర్ హర్షం

68
- Advertisement -

ఆదిత్య ఎల్‌1 ప్రయోగంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం… ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటిందన్నారు.

అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:మెరుగైన వ్యవసాయ ఉత్పత్తుల కోసం కృషి..

- Advertisement -