తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను నియమించింది సర్కార్. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సంతకం చేశారు. 2020 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఎక్కువ సమయం ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం వల్ల సోమేశ్ కుమార్ ను నియమించడం వల్ల స్థిరత్వం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఉన్న శైలేంద్ర కుమార్ జోషి పదవీకాలం నేటితో ముగియనుంది. నేడు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఇక శైలేంద్ర కుమార్ జోషి ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నీటి పారుదల వ్యవహారాల సలహదారుడిగా ఎస్.కె.జోషి వ్యవహరించనున్నారు. తెలంగాణ కొత్త సీఎస్‌గా నియమితులైన సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయన 2023 డిసెంబర్ 31 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. ఆయన గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గానూ విధులు నిర్వహించారు.