ప్రగతిభవన్‌లో దీపాలు వెలిగించిన సీఎం కేసీఆర్‌..

280
kcr cm

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించి సమైక్యతను చాటారు. ఈ ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో మంత్రులు,అధికారులతో కలిసి కొవ్వత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు.

pragathi bhavan

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, నగరాలు, పట్టణాలే కాకుండా గ్రామాల్లో సైతం మోదీ పిలుపుకు విశేష స్పందన వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలు తమ నివాసాల్లో లైట్లు ఆర్పి దీపాలు, కొవ్వొత్తులతో కరోనా మహమ్మారిపై పోరాట స్ఫూర్తిని చాటారు.

mp santhosh