ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు..

213
KCR
- Advertisement -

సీఎం కేసీఆర్ మ‌రోసారి త‌న ఉదార స్వ‌భావాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని తెలిపారు. శుక్రవారం శాస‌న‌స‌భ‌లో ద్రవ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. తెలంగాణ ఉద్య‌మంలో అన్ని ఉద్యోగ సంఘాలు పోరాటం చేశాయి. ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మ‌ర‌వ‌లేనిది. ఆర్టీసీ ఉద్యోగులు భ‌య‌ప‌డాల్సిన అవ‌సరం లేదు. ఆర్టీసీని కాపాడుతున్నామన్నారు.

బ‌డ్జెట్‌లో రూ. 3000 కోట్లు కేటాయించమని.. ప్ర‌తి నెల నిధులు విడుద‌ల చేస్తున్నామని.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పెంచిన‌ట్లే.. ఆర్టీసీ ఉద్యోగుల‌కు కూడా వేత‌నాలు పెంచుతామని సీఎం స్పష్టం చేశారు. ర‌వాణా శాఖ మంత్రితో త్వ‌ర‌లోనే చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం. ఈ విష‌యంలో ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -