తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల పెంపు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ షాక్షిగా శుభవార్త అందించారు. పీఆర్సీతో పాటు పదవీ విరమణ వయసు పెంపుకు సంబంధించి ఈరోజు కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి 58నుంచి 61కి పెంచుతున్నట్లు ప్రకటించారు.అలాగే ఉద్యోగుల పీఆర్పీ 30శాతంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి రానున్నట్టు సీఎం తెలిపారు.
తాము ఉద్యోగ సంఘాల నేతలతో పలుసార్లు ఈ విషయంపై చర్చించానని ఆయన అన్నారు. కరోనా, ఆర్థిక మాంద్యం కారణంగానే ఈ ప్రకటన ఆలస్యం అయిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. అన్ని విభాగాల ఉద్యోగుల అందరికీ పీఆర్సీ వర్తిస్తుందని ప్రకటించారు. తాము మానవీయ కోణంలో ఆలోచించి వేతనాలు పెంచామని ఆయన తెలిపారు. అలాగే, ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. సీఎం ప్రకటనతో ఉద్యోగులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.