హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్..నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

300
kcr ktr
- Advertisement -

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా సీఎం కేసీఆర్ రెండు రాష్ట్రాల పర్యటన ముగిసింది. కేరళ,తమిళనాడులో వారం రోజుల పాటు పర్యటించిన సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ పార్టీ నేతలతో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. మే 14వ తేదీతో స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నామినేషన్ ముగియనుండటంతో అభ్యర్థుల ఖరారుపై చర్చించనున్నారు. సాయంత్రంలోగా వరంగల్,రంగారెడ్డి,నల్గొండ ఎమ్మెల్సీ స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

తమిళనాడు పర్యటనలో భాగంగా కలాం మెమోరియల్‌తో పాటు రామేశ్వరం ఆలయాన్ని సందర్శించారు. మధురమీనాక్షి ఆలయంతో పాటు ధనుష్‌కోటి, రామసేతు, పంచముఖి హనుమాన్ ఆలయాలను సందర్శించారు. ముఖ్యమంత్రితో పాటు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఉన్నారు.

ఇక కేరళ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. గంటన్నరపాటు సాగిన ఈ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు,రాష్ట్రాల హక్కుల గురించి చర్చించారు.. కేసీఆర్ ప్రతిపాదనను స్వాగతించిన కేరళ సీఎం..పార్టీలో చర్చజరిగేలా చూస్తానని చెప్పారు.

- Advertisement -