ఏప్రిల్ 7 నాటికి రాష్ట్రంలో క‌రోనా బాధితులు ఉండ‌రుః సీఎం కేసీఆర్

188
kcroncarona
- Advertisement -

ఎప్రిల్ 7 వ తేది వ‌ర‌కు తెలంగాణ‌లో కరోనా బాధితులు ఉండ‌ర‌ని తెలిపారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. కరోనాపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 70కి చేరిందన్నారు. వీళ్ల‌లో 11మందికి నెగిటివ్ వ‌చ్చింద‌న్నారు. తెలంగాణ‌లో క‌రోనా చికిత్స తీసుకుని కోలుకున్న వ్యక్తితో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. గాంధీ వైద్యులు అందించిన ధైర్యంతోనే కోలుకున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. చికిత్స పొందుతున్న 58 మందికి కూడా పరీక్షలు నిర్వహించి తగ్గినవారిని క్రమంగా పంపిస్తాం. కరోనా వచ్చిన 76 ఏళ్ల వ్యక్తికి ఇతర జబ్బులు కూడా ఉన్నాయి. ఆయన ఒక్కడు తప్పించి మిగతా వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. పంపించే ముందు పక్కాగా పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకుంటాం.

క్వారంటైన్‌లో ఉన్న 27వేల 937 మందిపై నిఘా ఉంది. 11 మంది కోలుకున్నారు..వారిని సోమవారం డిశ్చార్జ్‌ చేస్తారని చెప్పారు. లాక్ డౌన్ మ‌న ఒక్క రాష్ట్రంలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ట్లు తెలిపారు. కొత్త కేసులు చేరకుంటే ఏప్రిల్‌ 7లోగా కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. వ్యాధికి మందులేదు సెల్ఫ్‌ కంట్రోల్‌ మాత్రమే మన ఆయుధం. మార్చి 30 నుంచి క్వారంటైన్‌ గడువు పూర్తి చేసుకుని ఆరోగ్యంగా ఉన్నవారినందరినీ డిశ్చార్జ్‌ చేస్తామని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయని, వాటి కొనుగోలు బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని వెల్లడించారు. ఈసారి ఎన్న‌డు లేనంత‌గా 40ల‌క్ష‌ల ఏక‌రాల్లో వ‌రి సాగు చేసిన‌ట్లు తెలిపారు. కరోనాపై లాక్ డౌన్ అమల్లో ఉన్నందున రైతులెవరూ మార్కెట్ యార్డులకు రావొద్దని, మార్కెట్ యార్డులను మూసివేశామని తెలిపారు. అధికారులే గ్రామాలకు వచ్చి రైతుల నుంచి గిట్టుబాటు ధర ఇచ్చి పంటలు కొంటారని వివరించారు.రైతులకు కూపన్లు ఇస్తారని, అందులో పేర్కొన్న సమయంలో రైతు తన పంటను అమ్ముకోవచ్చని సూచించారు.

- Advertisement -