విశాఖ ఘటన దురదృష్టకరం: సీఎం కేసీఆర్

211
kcr cm
- Advertisement -

విశాఖ గ్యాస్ లీకేజి ఘటనపై స్పందించారు సీఎం కేసీఆర్. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం …ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకేజీ కావడం దురదృష్టకరమని …బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

ఇక ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతిచెందగా సుమారు 200 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -