- Advertisement -
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లపై నెలకొన్న గందరగోళానికి పుల్ స్టాప్ పెట్టారు సీఎం కేసీఆర్. సోమవారం నుండి పాత పద్దతిలోనే రాష్ట్రంలో రిజిస్టేషన్లు జరపాలని రిజిస్టార్లకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. స్లాట్ బుకింగ్‌లు ఎవరూ అడగవద్దని.. కార్డు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకూ గురికాకూడదన్నారు సీఎం కేసీఆర్.
ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నావారికి యధావిధిగా రిజిస్ట్రేష్లను నిర్వహించనున్నారు.
- Advertisement -