హైదరాబాద్‌ నుండే దేశవ్యాప్త ఉద్యమం: సీఎం కేసీఆర్

140
kcr cm
- Advertisement -

కేంద్రంలో ఇప్పటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల అసమర్థ విధానాల వల్ల దేశంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు సీఎం కేసీఆర్. దేశ వ్యాప్తంగా 4 లక్షలకు పైగా మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటే, కేవలం 2.20 లక్షల మెగావాట్ల విద్యుత్ ను మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాం. ఇంకా రెండు లక్షల మెగావాట్లను వినియోగించుకోలేకపోతున్నాం. దేశంలో 70 వేల టిఎంసిల నీళ్లు అందుబాటులో ఉంటే వాటినీ వినియోగించుకోలేకపోతున్నాం. ఇంకా దేశంలో ప్రజలు మంచినీటి కోసం, సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఉన్న నీటిని వినియోగించుకునే తెలివి లేదు. దేశ జిడిపి వృద్ధిరేటు మైనస్ 24కు తగ్గింది. పెరుగుతుంది అనుకున్న దానితో కలుపుకుంటే దేశ జిడిపి మొత్తంగా 31 శాతం తగ్గింది. జిడిపి పెరుగుదల శాతంలో భారతదేశం కన్నా బంగ్లాదేశ్, శ్రీలంక ముందున్నాయి. మోడీ ప్రభుత్వం ఇంకా కొనసాగితే, నేపాల్ కూడా భారతదేశాన్ని దాటిపోయే అవకాశం ఉంది. 1980 వరకు భారతదేశం కన్నా తక్కువ జిడిపి ఉన్న చైనా నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. కానీ భారతదేశం కేంద్ర ప్రభుత్వం చేతగాని తనం వల్ల, తెలివిలేని తనం వల్ల, విధానాలను రూపొందించే శక్తి లేకపోవడం వల్ల వెనక్కి పోతున్నది’’ అని సిఎం కేసీఆర్ విమర్శించారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయదని అర్థమైపోయింది. కొత్త వ్యవసాయ బిల్లుల ద్వారా రైతాంగానికి అన్యాయం చేస్తున్నది.పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నది. మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను విభజిస్తున్నది.ప్రజల్లో భావేద్వేగాలను పెంపొందించి రాజకీయ లబ్ది పొందుతున్నది. ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదు. దేశానికి ఈ పద్ధతి ఉపయోడపడేది కాదు.బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. దేశంలో టెర్రరిజం వచ్చింది. నక్సలిజం వచ్చింది. కానీ మార్పు మాత్రం రాలేదు. గరీభీ హటావో అనే నినాదాలు వచ్చాయి తప్ప పేదరికం పోలేదు. కాంగ్రెస్, బిజెపి లు బడేభాయ్ వెంట చోటే భాయ్ అన్నట్లు దేశాన్ని సరైన దిశ చూపెట్టడంలో విఫలం అయ్యారు. కాబట్టీ దేశం మీద,ప్రజల మీద ఉన్న బాధ్యతతో టిఆర్ఎస్ చొరవ చూపుతుంది. బిజెపి విధానాలపై పోరాటానికి దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపై నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు.

నేను ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, డిఎంకె నేత స్టాలిన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ప్రకాశ్ సింగ్ బాదల్,కుమారస్వామి, సిపిఐ, సిపిఎం నాయకులతో మాట్లాడాను. దేశ వ్యాప్తంగా బిజెపి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడే విషంయలో కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ఈ నాయకులందరితో డిసెంబర్ రెండో వారంలో హైదరాబాద్ నగరంలో సదస్సు నిర్వహించబోతున్నాం. అందులో దేశ వ్యాప్తంగా చేయాల్సిన ఉద్యమం గురించి చర్చిస్తాం. దేశానికి ఓ దిశ, దశ నిర్ణయించే విషయంపై మాట్లాడతాం. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల నష్టపోతున్న రైతులు, కార్మికులు, పేదల పక్షాన నిలుస్తాం’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -