- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామని సిఎం స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్ చార్టు రూపొందించాలని, తమకు ఏ తేదీన ప్రమోషన్ వస్తుందో ఉద్యోగికి ముందే తెలిసి ఉండాలని, పదోన్నతుల కోసం పైరవీలు చేసే దుస్థితి పోవాలని సిఎం అన్నారు.
ఉద్యోగులు కూడా పదోన్నతుల విషయంలో వేసుకున్న కేసులను ఉపసంహరించుకోవాలని, అందరికీ పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను కూడా సృష్టిస్తామని వెల్లడించారు. మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను పరుష పదజాలంలో ధూషించడాన్ని ఇకపై ప్రభుత్వం సహించదని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సిఎం వెల్లడించారు.
- Advertisement -