పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ సీఎం జగన్‌

377
polavaram
- Advertisement -

ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం చేరుకున్న జగన్‌ ఎగువ,దిగువ,కాఫర్ డ్యామ్‌ నిర్మాణాలను పరిశీలించారు. పోలవరం వ్యూ పాయింట్‌కు చేరుకుని అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నదీగర్భంలో నిర్మిస్తున్న కాఫర్‌డ్యామ్‌కు సంబంధించి ప్రధానంగా సీఎం ప్రశ్నలు లేవనెత్తారు. ఎగువ కాపర్‌ డ్యామ్‌ పనులు ఎంత వరకు పూర్తయ్యాయి? భారీగా వరద వస్తే పరిస్థితి ఏంటి? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో వరద వస్తుందని తెలిసీ సీజన్‌ ముగిశాక కాఫర్‌ డ్యామ్‌ ఎలా నిర్మాణం చేపట్టారని అధికారులను ప్రశ్నించారు.

కాఫర్‌ డ్యామ్‌ కారణంగా నీరు స్పిల్‌వేపైకి వచ్చి నిర్మాణాలకు ఆటంకం కలిగితే ఎలా అని సందేహం వ్యక్తం చేశారు. సీఎంతో పాటు ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌. పి.విశ్వరూప్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -