జగన్ సంచలనం..ఏకంగా 81 స్థానాల్లో?

28
- Advertisement -

ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలో పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు రెండు కూడా మే 13 న జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మరోవైపు అధికార వైసీపీ లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిలను ప్రకటించి మరింత హీట్ పెంచింది. 25 లోక్ సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే సారి అభ్యర్థులను ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. .

అయితే ప్రస్తుతం వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే ఏకంగా 81 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను, 18 చోట్ల సిట్టింగ్ ఎంపీలను మార్పులు చేర్పులు చేయడంతో పాటు మరికొన్ని చోట్ల టోటల్ గా పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మామూలుగా ప్రజావ్యతిరేకత, ఎమ్మెల్యేల పనితీరును దృష్టిలో ఉంచుకొని కొన్ని సీట్లలో అభ్యర్థులను మార్చడం సాధారణమే. అయితే ఏకంగా సగానికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు 50 శాతానికి పైగా టికెట్లు కేటాయించినట్లు ఆ పార్టీ అధిష్టానం చెబుతోంది.

ఈ సామాజిక వర్గాలకు ఈ స్థాయిలో సీట్లు కేటాయించడం, అదే విధంగా ఈ స్థాయిలో సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేయడం బహుశా ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు చోటు చేసుకొని పరిణామం. అయితే జగన్ ఇంత భారీగా అభ్యర్థులను మార్చడం వెనుక అసలు కారణం ఎంతనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నిజానికి 40 నుంచి 50 సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాట్లు మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి.

ఎమ్మెల్యేల సమీక్ష సమావేశాల్లో పలుమార్లు జగన్ హెచ్చరించారు కూడా అయినప్పటికి ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడక పోవడంతో పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా అంతర్గతంగా చేయించిన సర్వేలలో చాలమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం. అందుకే భారీగా అభ్యర్థుల మార్పు చేసినట్లు తెలుస్తోంది. అయితే సీటు దక్కని చాలమంది సిట్టింగ్ ఎమ్మేల్యేలు ప్రతిఘటించే అవకాశం ఉంది. మరి వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారా ? లేదా ఆయా ఎమ్మేల్యేలు పార్టీని వీడతారా అనేది చూడాలి.

Also Read:ఏఏ దశలో ఎన్ని స్థానాలకు ఎన్నికలంటే?

- Advertisement -