జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన టార్గెట్ సిఎం పదవే అని ఒక్కసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని తన ప్రతి ప్రసంగంలోనూ ప్రజలను కోరుతున్నాడు. గతంలో సిఎం పదవిపై తనకు ఎలాంటి ఆశ లేదని చెప్పిన పవన్ ఈ మద్య సిఎం పదవే టార్గెట్ అంటున్నారు. కాగా ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల మద్య త్రిముఖ పోరు ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటే పొత్తు ఒక్కటే మార్గమని భావించిన టీడీపీ జనసేన పార్టీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే టీడీపీ జనసేన పార్టీలు కలిస్తే సిఎం అభ్యర్థి ఎవరనేది అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు మరియు పవన్ ఇద్దరు కూడా సిఎం పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు..
ఈ నేపథ్యంలో వీరిద్దరిలో సిఎం అభ్యర్థి ఎవరనేది తేల్చడం కష్టమే. అయితే ఒకవేళ ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిస్తే సిఎం అభ్యర్థిగా పవన్ కే ఎక్కువ ఛాన్స్ ఉంటుందని కొందరి విశ్లేషకుల అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఏర్పడడం పక్కా అని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు కూడా తిరిగి ఎన్డీయే కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న జరిగే ఎన్డీయే మిత్రపక్ష కూటమికి పవన్ కు ఆహ్వానం అందగా.. చంద్రబాబుకు మాత్రం ఇంకా ఆహ్వానం అందలేదు.
Also Read:తలనొప్పి తగ్గించే చిట్కాలు..
దీన్ని బట్టి చూస్తే ఏపీలో టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీలు కలిస్తే సిఎం అభ్యర్థిగా పవన్ కే బీజేపీ మొగ్గు చూపే అవకాశం ఉంది. అటు టీడీపీకి ఎన్డీయే దోస్తీ అవసరం అయినందున చంద్రబాబు కూడా సిఎం అభ్యర్థి విషయం పవన్ కు మద్దతు ఇవ్వక తప్పదని కొందరి విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ పవన్ సిఎం అభ్యర్థిగా చంద్రబాబు నో అంటే.. టీడీపీ మళ్ళీ ఒంటరిగా బరిలోకి దిగాల్సి ఉంటుంది. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగితే వైసీపీకి ప్లెస్ అయి మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పవన్ కే ఎక్కువ అనుకూలమని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read:నిత్యామీనన్ ఇంట విషాదం..