దంతాలు పుచ్చిపోకుండా ఉండాలంటే..?

109
- Advertisement -

నేటిరోజుల్లో చాలమంది పుచ్చు దంతాలతో లేదా దంత క్షయంతో భాదపడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలలో ఈ దంత సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే ఈ మద్య కాలంలో పెద్దవారిలో కూడా ఈ దంత సమస్యలు పెరిగిపోయాయి. దంతాలు పుచ్చిపోయి ఆహారం నమలడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతే కాకుండా పుచ్చు దంతాల వల్ల వచ్చే నొప్పి వర్ణనాతీతం. అయితే దంతాలు పుచ్చిపోవడానికి లేదా దంతక్షయం రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, ఎక్కువగా స్వీట్స్ వంటివి తినడం వంటి ఎన్నో కారణాల వల్ల దంత సమస్యలు లేదా చిగుళ్ళ సమస్యలు ఏర్పడతాయి.

ఇలా దంతసమస్యలు లేదా చిగుళ్ళ సమస్యలు అధికంగా ఉన్నప్పుడూ చల్లటి పదార్థాలను లేదా వేడి పదార్థాలను అసలు తినలేము. దాంతో ఈ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు డెంటిస్ట్ ను సంప్రదించి మెడిసన్స్ వాడుతూ ఉంటాము. అయితే మెడిసన్ వాడినప్పుడు నొప్పి కాస్త తగ్గుముఖం పట్టిన.. ఆ తరువాత మళ్ళీ యదాస్థితికి చేరుకుంటుంది. దాంతో వేరే దారి లేదా పుచ్చు దంతాలను తొలగించాల్సివస్తుంది. అయితే దంతాలను తొలగించకుండా పుచ్చు దంతాలను నివారించేందుకు స్పటికం చాలా బాగా ఉపయోగ పడుతుంది. దీనిని ఆయుర్వేద ఔషధాలలో కూడా వినియోగిస్తారు.

ఒక చిన్న స్పటికం ముక్క ను తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి.. స్పటికం కరిగే వరకు నీటిలో నానబెట్టాలి. అది పూర్తిగా కరిగిన తరువాత ఆ నీటితో దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల పుచ్చు దంతాలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఇక ప్రతిరోజూ కూడా క్రమం తప్పకుండా బ్రేస్ చేసుకోవాలి. టూత్ బ్రేష్ ను కూడా 6 నెలలకు ఒకసారి మార్చాలి. దాంతో దంతక్షయం ఏర్పడకుండా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, క్రీమ్, చీజ్ వంటి డెయిరీ ఉత్పత్తులను రోజువారి ఆహారంలో తీసుకోవాలి. నీరు తగినంతా తాగడం వల్ల నోటిలో నీటి శాతం పెరుగుతుంది. తద్వారా దంతక్షయం దరిచేరదు. చక్కెర లేని షుగర్ లెస్ చూయింగ్ గమ్ లను నమలడం వల్ల నాట్లోని బ్యాక్టీరియా దూరం అవుతుంది. దాంతో దంతసమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా చిన్న చిన్న సూచనలు పాటించడం వల్ల దంతాలు పుచ్చిపోకుండా లేదా దంత క్షయం రాకుండా జాగ్రత్త పడవచ్చు.

 Also Read:రాజకీయాలకు గుడ్ బై: ఎంపీ గల్లా

- Advertisement -