సెలవు కోసం.. జూనియర్‏ని హత్య చేసిన టెన్త్ విద్యార్థి.. ‏

286
murder
- Advertisement -

సినిమాల ప్రభావమో.. సీరియల్స్ ప్రభావమో తెలియదు కానీ.. రోజు రోజుకు పిల్లలో క్రూరత్వం పెరుగుతోంది. సినిమాలలో జరిగే సన్నివేశాలను తలపిస్తున్నారు నేటి విద్యార్థులు. తనకు టీచర్ ఇచ్చిన హోం వర్క్ బాధను తప్పించుకోవడాని ఓ స్కూల్ విద్యార్థి దారుణానికి ఓడిగట్టాడు. ఎవర్నైనా ఒకర్ని చంపితే ఈ రోజు స్కూల్‏కి సెలవు ఇస్తారని భావించి, 9వ తరగతి విద్యార్థిని హత్య చేశాడు, 10వ తరగతి విద్యార్థి. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం వడోదరలో జరిగింది.

Vadodhara school murdar

వివరాల్లోకి వెళితే.. వడోదరలోని ఓ స్కూల్‏లో పదోతరగతి చదువుతున్న పిల్లలకు టీచర్ హోం వర్క్ ఇచ్చింది. ఇక హోం వర్క్ చెయ్యని ఓ విద్యార్థి.. ఈ హోం వర్క్ బాధను ఎలాగైనా తప్పించుకోవాలని అనుకున్నాడు. ఎవర్నైనా ఒకర్ని చంపితే.. స్కూల్‏కి సెలవు వస్తుందని భావించాడు. ఇదే క్రమంలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని, స్కూల్ బాత్ రూమ్‏లో దారుణంగా హత్య చేశాడు. కత్తితో ఆ విద్యార్థిని 10 సార్లు పొడిచి చంపాడు.

హత్య చేసిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆ విద్యార్థి మైనర్ కావడంతో.. బాల నేరస్తుల శిక్షణాలయానికి తరలించారు. విద్యార్థి మానసికి స్థితిపై వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని గుజరాత్ బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జాగృతీ పాండ్యా వెల్లడించారు. ఇలాంటి సంఘటనే గత సంవత్సరం గుర్‏గావ్‏లో జరిగింది. పరీక్షలు వాయిదా వేయించాలని భావించిన ఓ విద్యార్థి, ఏడేళ్ల బాలుడిని గొంతు కోసి హత్య చేశాడు.

- Advertisement -