టాలీవుడ్ లో సినిమాపోటీలు దగ్గరపడుతున్నాయి. నేనంటే నేనంటూ..వారి సినిమాలతో ఎంతటి సినిమాలతోనైనా పోటీ పడడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో నటసింహం బాలయ్యతో జూ.ఎన్టీఆర్ సినీ యుద్దానికి రెడీ అయిపోతున్నాడని టాక్.
అసలే బాలకృష్ణ- యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య అంతర్యుద్ధం గురించి తెలిసిందే. ఎన్టీఆర్ అంటే బాలయ్య ఫ్యాన్స్‌కు, బాలయ్య అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పడకపోవడం చాలా కాలంగా నడుస్తున్నదే. అయితే..ఇదివరకు రిలీజైన బాలయ్య ‘డిక్టేటర్’కు పోటీగా ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది.
దీంతో బాలయ్య ‘డిక్టేటర్’ డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. మరోసారి అదే తరహా క్లాషెస్ నందమూరి హీరోలు నటించిన సినిమాలకు తప్పేట్టు లేదని అభిమానులలో, పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది.నిజానికి బాలకృష్ణ హీరోగా పూరి దర్శకత్వం వహిస్తున్న 101వ సినిమా శరవేగంగా షూటింగ్‌ని కంప్లీట్ అవుతోంది. ఈ సినిమాని దసరా బరిలో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించింది చిత్ర టీమ్. అయితే ఇప్పుడు ఈ సినిమాతో ఎన్టీఆర్ నటించిన సినిమా డైరెక్ట్‌గా పోటీపడే ఛాన్స్ ఉందని ఫిల్మ్‌నగర్ టాక్.
ఇక ఎన్టీఆర్-బాబి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ చిత్రాన్ని ఆగష్టు 11కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం అవ్వడం డిలేకి కారణమవుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఇక దసరాకే రిలీజ్ అయితే బావుంటుందనే ఆలోచనలో తారక్ వర్గం ఉన్నట్టు తెలిసింది. మళ్ళీ బాబాయ్- అబ్బాయిల మధ్య సినిమా పోరు తప్పదనే చెప్పాలి.