పవన్ కళ్యాణ్ కి, దర్శకుడు క్రిష్ కి మధ్య ప్రస్తుతం పొసగడం లేదు. డేట్లు ఎప్పుడు ఇస్తారు చెప్పండి అంటూ నేరుగా పవన్ వైపే నోరు ఎత్తాడు క్రిష్. “హరి హర వీరమల్లు”కి సంబందించిన అనేక విషయాల్లో పవన్ – క్రిష్ విభేదిస్తున్నారు అని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ, కథనాలు, పాటలు విషయాల్లో పవన్ కళ్యాణ్ సంతృప్తిగా లేడని కూడా వార్తలు వచ్చాయి. కానీ, నిర్మాత రత్నం మాత్రం అవన్నీ పుకార్లు అని కొట్టి పారేశారు. కానీ షూటింగ్ మాత్రం ముందుకు వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ మిగిలిన సినిమాలకు డేట్లు ఇస్తున్నాడు గానీ, “హరి హర వీరమల్లు”ను మాత్రం పట్టించుకోవడం లేదు.
సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి కూడా ఈ సినిమా నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా నిర్మాత రత్నం మాత్రం పెద్ద బిల్డప్ ఇచ్చి ఇవన్నీ కేవలం పుకార్లు అని స్టేట్ మెంట్ లు ఇచ్చాడు. కానీ, ఇప్పుడు అవి పుకార్లు కాదు నిజమని తేలింది. డేట్లు ఎప్పుడు ఇస్తారు అని క్రిష్ అడిగితే.. ఇప్పట్లో డేట్స్ ఇచ్చేది లేదు, ముందు స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా చెయ్యి. డేట్లు గురించి తర్వాత ఆలోచిద్దాం అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పాడట. ఇప్పుడు ఏం చెయ్యాలో నిర్మాత కూడా తేల్చుకోలేకపోతున్నాడు.
Also Read:పిక్ టాక్ : ప్రియా గ్లామరసం.. అదరహో
ఇప్పటివరకు.. ఎన్ని జరిగినా సర్దుకుంటూ పోయిన రత్నం.. ఈ సారి మాత్రం సైలెంట్ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. దీన్ని బట్టి కన్ఫర్మ్ అయింది క్రిష్, పవన్ కళ్యాణ్ మధ్య సరైన అండర్ స్టాండింగ్ లేదనేది. ముఖ్యంగా క్రిష్ మాట ఈ సినిమా విషయంలో చెల్లడం లేదు. పవన్ కళ్యాణ్ అనేక విషయాల్లో గట్టిగా పట్టుబడుతున్నారు. అందుకే, ఆయన మాటిమాటికీ షూటింగ్ ఆపేసి వేరే సినిమాల సెట్స్ పైకి వెళ్తున్నారు. ఇంత జరిగినా ఇంకా అంతా బాగానే ఉంది అని నిర్మాత రత్నం అనుకుంటే.. అంతకుమించిన సమస్య ఆయనకు మరొకటి ఉండదు.
Also Read:ఆ సీనియర్ నటి పరితపిస్తోంది