వీడియో.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టునే వాడండి!

14
- Advertisement -

పూణేలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ తన కుమార్తెను పాఠశాల నుంచి తీసుకొచ్చేందుకు Uber ఆటో బుక్ చేసింది. ఆటో ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చిన వెంటనే, ఓ స్థానిక ఆటో డ్రైవర్ వచ్చి అడ్డగించాడు. రైడ్‌ను రద్దు చేయాలని నానా హంగామా చేశాడు. దీనిపై ఉబర్ డ్రైవర్ అభ్యంతరం తెలపగా అతడిపై కూడా దాడి చేసేంత పనిచేశాడు. రైడ్‌ను క్యాన్సల్ చేయాల్సిందేనని నానా హంగామా చేశాడు.

ఇక ఇలాంటి సంఘటనే రామ్‌వాడీ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. అక్కడ ఓ Uber ఆటో డ్రైవర్‌ను రిక్షా వాలాల గుంపు వేధించిన వీడియోను ఓ Reddit యూజర్ షేర్ చేశాడు. తాను రామ్‌వాడీ మెట్రో దగ్గర పైనుండి వీడియో తీసాను అని తెలిపాడు.

దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో స్పందించారు. ఇలాంటి ఆటో డ్రైవర్లకు బుద్ధి చెప్పాలంటే, మనం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, క్యాబ్స్ లేదా మన సొంత వాహనాలు వాడాల్సిందే. లేకపోతే మనం ఇదే పరిస్థితిని తిరిగి తిరిగి చూడాల్సి వస్తుంది అని కామెంట్ చేస్తున్నారు.

 

Also Read:పవన్.. అడవితల్లి బాట

- Advertisement -