‘హనుమాన్’ సీక్వెల్ పై స్పందించాడు

21
- Advertisement -

కేంద్ర మంత్రి అమిత్ షాను హనుమాన్ చిత్ర బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రశాంత్ వర్మ కేంద్రమంత్రికి హనుమాన్ విగ్రహాన్ని అందజేశారు. అమిత్ షాను కలవడం ఎంతో అందంగా ఉందని, ఇటువంటి చిత్రాన్ని ప్రోత్సహించినందుకు ధన్యవాదాలని ప్రశాంత్ వర్మ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా హీరో తేజా సజ్జ కూడా పాల్గొన్నారు. మరోవైపు ఈ మూవీ OTT విడుదలపై జీ5 కీలక ప్రకటన చేసింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అతి త్వరలో ఈ సినిమా తెలుగు వెర్షన్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ కానున్నట్లు ట్వీట్ చేసింది. సంక్రాంతికి రిలీజై ఈ మూవీ రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది.

కాగా, ఈ మూవీ హిందీ వెర్షన్ శనివారం నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. అందుకే, ఈ సినిమా సీక్వెల్ కోసం పాన్ ఇండియా వైడ్ గా అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఐతే, హనుమాన్ సీక్వెల్ ను ఇంకా స్టార్ట్ చేయలేదు. దీంతో హనుమాన్ మూవీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ సమాధానం ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నేను ఏదో కావాలని ‘హను మాన్’ సీక్వెల్ ను ఆలస్యం చేయట్లేదు.

ప్ర‌శాంత్ వ‌ర్మ ఇంకా మాట్లాడుతూ.. హను మాన్ సీక్వెల్ సినిమా స్క్రిప్ట్ అండ్ షూటింగ్ ఆలస్యం కావ‌డం అనేది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నది కాదన్నారు. ఎల్లప్పుడూ మీకు ఉత్తమమైనది ఇవ్వాల‌ని చూస్తామని స్పష్టం చేశారు. రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి మీకు బెస్ట్ అవుట్‌పుట్ అందించాల‌ని చూస్తున్నామన్నారు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ప్ర‌శాంత్ వ‌ర్మ చెప్పుకొచ్చాడు.

Also Read:వరలక్ష్మీ శరత్ కుమార్… ‘అర్జునుడి గీతోపదేశం’

- Advertisement -