ఎక్కడున్నా ఏకం చేసేది భాషే: సీజేఐ మరణ

44
cji
- Advertisement -

తెలుగు వారు ఎక్కడున్న ఏకం చేసేది భాషే అన్నారు సీజేఐ ఎన్వీ రమణ. కాలిఫోర్నియాలో ఇండో, అమెరికన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన…విశ్వమానవ సౌభ్రాతృత్వానికి తెలుగువారు ప్రతీకలు కావాలని చెప్పారు. భారత్‌లో సరైన నాయకులను తయారుచేసుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు.

ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానిది కీలక పాత్ర అని, సాకేంతిక ప్రపంచంలో అధునాతన ఆవిష్కరణలు అవసరమని సీజేఐ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. మౌలిక సదుపాయాల వృద్ధి వేగంగా పెరిగిందని తెలిపారు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు వస్తేనే మార్పు సాధ్యమవుతుందని చెప్పారు.

భాష లేకపోతే చరిత్ర లేదని, సంస్కృతి లేదన్నారు. భాష లేకపోతే మనం అంతరించిపోతామన్నారు. తెలుగువాడి తెలివితేటలకు జైజై, తెలుగువాడు దేనికైనా సైసై అని పేర్కొన్నారు. ప్రజల్లో మార్పు కోసం వ్యవస్థలు కలిసి సాగాలని చెప్పారు.

- Advertisement -