- Advertisement -
న్యాయవ్యవస్థ ఏ ఒక్కరి కోసం పనిచేయదని…స్వార్ధ పరుల కోసం పనిచేసే సంస్థ కాదని తేల్చిచెప్పారు జస్టిస్ ఎన్వీ రమణ. రాష్ట్రంలో కొత్త జిల్లాల కోర్టుల ప్రారంభం సందర్భంగా మాట్లాడిన సీజేఐ…వ్యవస్థలను చక్కబెట్టుకోలేని వారు కోర్టులను తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. పరిధి దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
సమాజ శ్రేయస్సే న్యాయ వ్యవస్థ లక్ష్యమని…కొంతమంది తీర్పులను తప్పుపట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్య మనుగడ సాగాలంటే న్యాయ వ్యవస్థ కీలకం అని అంతా న్యాయ వ్యవస్థకు మద్దతివ్వాలని తెలిపారు.
సంక్షేమ పాలనే ధ్యేయంగా కొత్త అధ్యాయానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో దేశానికే తెలంగాణ ఆదర్శమన్నాని….చాలా ఏళ్ల తర్వాత న్యాయ వికేంద్రీకరణ జరిగిందన్నారు.
- Advertisement -