దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య కేసు తుది తీర్పు మరికాసేపట్లో వెలువడనుంది. ఇందుకు సంబంధించి దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. కాసేపటి క్రితమే భారీ భద్రత నడుమ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారధ్యంలోని ఐదుగురు సభ్యులు. ఈ తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు పరిసరాల్లో కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా సుప్రీంకోర్టు వద్ద భారీ సంఖ్యలో న్యాయవాదులు, జర్నలిస్ట్ లు ఉన్నారు. కాగా సుప్రీం తీర్పు ఎలా ఉన్నా దేశ ప్రజలు అందరూ సంయమనం పాటించాలని పిలుపు నిచ్చారు మోదీ. ఇక అయోధ్య తీర్పు నేపధ్యంలో ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ లో స్కూళ్లకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబాయి ఇలా పలు ప్రధాన నగరాల్లో పారామిలటీ బలగాలతో భారీ భద్రతను ఏర్పరిచారు. రైల్వే స్టేషన్లలో కూడా హైఅలర్ట్ ప్రకటించారు.