నిర్భయ కేసు.. నూతన ధర్మాసనం ఏర్పాటు

394
supreme
- Advertisement -

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు పూరైంది. నిర్భయ కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ ను దోషిగా ప్రకటించింది కోర్టు. అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ రివ్యూ పిటిషన్‌ విచారణ ధర్మాసనం నుంచి చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బొబ్డే తప్పుకున్నారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు వేరే ధర్మాసనం ఈ రివ్యూ పిటిషన్‌పై విచారణ చేపడుతుందని జస్టిస్ బొబ్డే పేర్కొన్నారు.

నూతన ధర్మాసనంలో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నిందితుల్లో ఒకడైన అక్షయ్‌ సింగ్‌ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాడు.. తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలని విన్నవించుకున్నాడు. నిర్భయ కేసులో తనను తప్పుగా దోషిగా నిర్ధారించారని.. పలు దేశాల్లో ఉరిశిక్షలను రద్దు చేశారనే విషయాన్ని కూడా తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

- Advertisement -