రేషన్ డీలర్లపై ఫిర్యాదులు..టోల్ ఫ్రీకి కాల్ చేయండి

325
telangana
- Advertisement -

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించి పేదలకు రేషన్ కార్డ్ లబ్ధిదారులకు ఉచిత బియ్యం తోపాటు 1500 నగదు అందజేస్తున్నాం అని సివిల్ సప్లై వినియోగదారుల ఫోరమ్ అధికారులు తెలిపారు.లబ్ధిదారులకు ఎవరికైనా సరుకులు అందకపోతే పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన 1967,180042500334 నంబర్ లకు ఫిర్యాదుల చేయవచ్చు.24 గంటలు అందుబాటులో ఉంటామని చెప్పారు.

ఇప్పటి వరకు 17 వేలకు పైగా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్న వినియోగదారుల ఫోరం సిబ్బందన్నారు. ప్రతి రేషన్ కార్డుదారుడు ఆధార్ కార్డుకు లింక్ చేసిన బ్యాంకు ఖాతాలో 1500 నగదు జమ చేస్తున్నాం అని…బ్యాంకు ఖాతాలకు సంబంధించి సమస్య వచ్చిన వారికి పోస్ట్ ఆఫీస్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నాం.ఆధార్ తో అనుసంధానం అయిన ప్రతి బ్యాంక్ ఖాతాలో లబ్ధిదారులకు డబ్బులు వేస్తున్నాం అన్నారు.

ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, కందిపప్పు, నగదు అందేలా చర్యలు తీసుకుంటున్నామని…రేషన్ డీలర్లు బియ్యం, కందిపప్పు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు.

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని…రేషన్ లబ్ధిదారులకు రేషన్, నగదు జమ విషయంలో సమస్యలు తలెత్తితే 1967 కు ఫిర్యాదు చేయాలన్నారు.లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నాం అన్నారు.

కంది పప్పు 4 జిల్లాల్లో మాత్రమే ఇస్తున్నాం 15 వ తేదీ నుండి అన్ని జిల్లాల లో లబ్ధిదారులకు కంది పప్పు అందిస్తాం అన్నారు.నిత్యావసర వస్తువులు కొనుగోలు విషయంలో అధిక ధరలకు అమ్మితే 73307 74444 వాట్స్ యాప్ నంబెర్ కు పిర్యాదు చేయవచ్చు మాకు పిర్యాదు అందిన 24 గంటల విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నాం,లీగల్ మెట్రలాజి శాఖకు పంపించి వారిపై చర్యలు తీసుకునేలా చేస్తున్నాం అన్నారు.

- Advertisement -