- Advertisement -
గత రాత్రి నుంచి గోల్కొండ ప్రాంతంలో చిరుత పులి లేదా పాంథర్ తిరుగుతోంది అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అటవీ శాఖ తెలిపింది.
సివిట్ క్యాట్ (మాను పిల్లి) అనే జంతువు అక్కడ కనిపించింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ వెంటనే స్పందించి ఈ ఉదయం దానిని బంధించింది. ప్రస్తుతం జూపార్కు కు తరలించారు.
తగిన రక్షణ చర్యలు తీసుకున్నామని జూపార్కులో దాని ఆరోగ్యాన్ని పరిశీలించిన మీదట తదుపరి చర్యలు తీసుకుంటామని PccF ఆర్. శోభ వెల్లడించారు. స్థానికులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అటవీ శాఖ స్పష్టం చేసింది.
- Advertisement -