అప్రమత్తంగా ఉండాలి : సీవీ ఆనంద్‌

25
anand
- Advertisement -

వాతావరణ శాఖ రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాల కారణంగా తెలంగాణకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించడంతో దీంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రజలకు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. చిన్నపిల్లలతో పాటు నగర ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి వేళ్లల్లో పోలీసులను విధుల్లో ఉంచుతున్నట్లుగా కమిషనర్‌ తెలిపారు. భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జీహెచ్‌ఎంసీతో కలిసి పని చేస్తున్నామని, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అప్రమత్తం చేశామని తెలిపారు. వరదలతో నగరంలోని చెరువులు నిండి ఇండ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100కి ఫోన్‌ చేయాలని సూచించారు. విద్యా సంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించిందని తెలిపారు.

- Advertisement -