- Advertisement -
పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులు పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం కేంద్రప్రభుత్వానికి నోటిసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.
తదుపరి విచారణను జనవరి 22కు వాయిదా వేసినట్లు ప్రకటించింది. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై పలువురు నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదు చేశారు.రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజలను విభజించేలా ఉన్న పౌరసత్వ చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా డిమాండ్ చేస్తూ సుప్రీంలో 59 పిటిషన్లు దాఖలయ్యాయి.
- Advertisement -