షూటింగ్స్ బంద్..!

107
- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న అయోమయ పరిస్థితుల కారణంగా ఆగ‌స్టు 1 నుండి అన్నిర‌కాల షూటింగ్స్ బంద్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్. 21 మంది సభ్యులు పాల్గొన్న ఈ స‌మావేశంలో షూటింగ్‌లు బంద్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ నిర్ణ‌యంతో ప‌లు పెద్ద సినిమాల‌తో పాటు చిన్న సినిమాల‌పై కూడా ఎఫెక్ట్ ప‌డ‌నుంది. అందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాలు ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’ ఉన్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలు గాడ్‌ఫాదర్, భోళాశంకర్, వాల్తేరు వీరయ్య లపై కూడా ఈ సినిమా షూటింగ్స్ బంద్ ప్రభావం గట్టిగానే పడనుంది.

అలాగే బాల‌య్య‌. రామ్ చ‌ర‌ణ్, త‌మిళ హీరో విజ‌య్ సినిమాల‌పై కూడా ఎఫెక్ట్ ప‌డ‌నుంది. దీంతో పాటు దసరా, రావణాసుర, మారేడుమిల్లి ప్రజానీకం ఇలా దాదాపు 30 సినిమాలు వరకు షూటింగ్స్ నిలిచిపోయే అవకాశం ఉంది.

- Advertisement -