గెలిచిన..ఓడిన సినీ ప్రముఖులు వీరే!

22
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి అధికారం చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8న మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక ఈ సారి ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు బరిలో నిలవగా వీరిలో కొంతమంది గెలిచి కింగ్‌ మేకర్‌లుగా నిలవగా మరికొంతమంది ఓటమి పాలై జీరోలయ్యారు.

ప్రధానంగా ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో విజయం సాధించారు. అలాగే నందమూరి బాలకృష్ణ హిందూపుర్‌లో హ్యాట్రిక్ కొట్టారు.

ఇక వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి లక్షకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందింది. కేరళలో బీజేపీ తొలిసారి ఖాతా తెరచింది. సినీ నటుడు మలయాళ నటుడు సురేష్ గోపి విజయం సాధించారు. రేసు గుర్రం విలన్ రవి కిషన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ ఎంపీగా విజయం సాధించారు. అలాగే మనోజ్ తివారి ఢిల్లీ నుండి, రామాయణం సీరియల్‌లో శ్రీరాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ సైతం బీజేపీ నుండి గెలుపొందారు. రచనా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ స్థానం తృణమూల్ తరపున, శత్రుజ్ఞ సిన్హా టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన హేమమాలిని మరోసారి భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఇక ఓటమి పాలైన వారిలో కన్నడ స్టార్ హీరో వరాజ్ కుమార్ భార్య, నిర్మాత గీతా శివరాజ్ కుమార్ , నటి రోజా, నవనీత్ కౌర్, రాధిక ఓటమి పాలైన వారిలో ఉన్నారు.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌ను కొనసాగిస్తాం:సంతోష్ కుమార్

- Advertisement -