నాలుగో రోజుకు సినీ కార్మికుల సమ్మె

5
- Advertisement -

టాలీవుడ్ లో వేతన పెంపు వివాదం కొనసాగుతోంది. వేతన పెంపు కోసం నాలుగో రోజుకు చేరుకుంది సినీ కార్మికుల సమ్మె. నిర్మాతలకు, సినీ కార్మికులకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

30 శాతం వేతనాలు పెంచాలని కార్మికులు పట్టుబడుతుండగా సినీ కార్మికుల డిమాండ్లను అంగీకరించలేదు నిర్మాతలు. దీంతో పలు సినిమాల షూటింగ్‌లను అడ్డుకుంటున్నారు కార్మికులు. ఇక సినీ కార్మికుల సమ్మెపై లేబర్ కమిషనర్ తో చర్చించారు నిర్మాతలు.

మరోవైపు ఇటు నిర్మాతలు అటు కార్మికులు.. మెగాస్టార్ చిరంజీవిని మధ్యవర్తిగా సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నారు.

Also Read:ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల..

- Advertisement -