ముగిసిన సినీ కార్మికుల స‌మ్మె..

31
telugu film
- Advertisement -

వేత‌నాల పెంపుకై సినీ కార్మికులు చేప‌ట్టిన స‌మ్మె ముగిసింది. స‌మ్మెలో 24 క్రాఫ్ట్‌ల‌కు సంబంధించిన స‌భ్యులు పాల్గొన‌గా కార్మికుల వేత‌నాలు పెంచేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది తెలుగు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్. జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో రేప‌టి నుండి య‌దావిధిగా షూటింగ్స్ జ‌ర‌గ‌నున్నాయి.

పెంచిన జీతాలు రేప‌టి నుంచి అమ‌లు చేస్తాం. పెంచిన జీతాలు చెల్లించే బాధ్య‌త ఫెడ‌రేష‌న్, ఫిలించాంబ‌ర్ల‌దేన‌ని ప్ర‌తినిధులు ప్ర‌క‌టించారు. అయితే జీతం ఎంత పెంచాల‌న్న దానిపై మ‌రోసారి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు.

మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ చొర‌వ‌తో ఫిలిం ఫెడ‌రేష‌న్ స‌భ్యుల‌తో స‌మావేశం నిర్వ‌హించాం అని తెలిపారు సి క‌ల్యాణ్.

- Advertisement -