సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు ఆయన ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన న్యూ ఇయర్ విషెష్ తెలుపుతూ స్వతంత్ర అభ్యర్ధిగా పార్లమెంట్ కు పోటీ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానో త్వరలోనే చెబుతానన్నారు. ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ కు పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆయనకు కాంగ్రాట్స్ తెలుపుతున్నారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాలని కొంత కాలంగా ప్రకాశ్ రాజ్ పోరాడుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల నుంచి ప్రకాశ్ రాజ్ మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చాలాసార్లు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొత్తానికి ప్రకాశ్ రాజ్ పోలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ అయినట్టే అనుకోవాలి.
HAPPY NEW YEAR TO EVERYONE..a new beginning .. more responsibility.. with UR support I will be contesting in the coming parliament elections as an INDEPENDENT CANDIDATE. Details of the constituency soon. Ab ki baar Janatha ki SARKAR #citizensvoice #justasking in parliament too..
— Prakash Raj (@prakashraaj) December 31, 2018