సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావాలి అంటే చాలా కలిసి రావాలి. అందుకే, ఎంతో అందమైన కథానాయికలకు కూడా స్టార్ డమ్ రావడానికి చాలా సమయం పడుతుంది. శ్రద్ధా దాస్ లాంటి మరికొంతమందికి అయితే, అసలు సక్సెసే రాదు. ఐతే, కియారా అద్వానీ, సాయి పల్లవి లాంటి కథానాయికలకు చాలా ఈజీగా స్టార్ డమ్ వస్తుంది. ఈ రెండో కేటగిరిలో సాయి పల్లవినే మెయిన్ హైలైట్. తెలుగులో మొదటి సినిమాగా ఆమె చేసిన ‘ఫిదా’ సంచలన విజయాన్ని సాధించింది. దీనికితోడు ఇతర భాషల్లోనూ సాయి పల్లవికి మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది.
అలాంటి సాయి పల్లవి తాజాగా ఓ స్టేజ్ పై మాట్లాడుతూ తన నటన పై, తన సినీ కెరీర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఆ కామెంట్స్ ఏమిటో సాయి పల్లవి మాటల్లోనే.. ‘నేను సినిమాల్లోకి వచ్చే ముందు చాలా నెగిటివ్ మాటలు విన్నాను. సినిమా హీరోయిన్ అంటేనే గ్లామర్ డాల్. అస్సలు నువ్వు ఎలా హీరోయిన్ గా ఫిట్ అవుతావు ? అంటూ నా ఫ్యామిలీ మెంబర్స్ లోనే కొందరు అన్నారు. ఒక విధంగా నేను యాక్టింగ్ వైపు రావడం మా ఫ్యామిలీలో కొందరికి ఎంత మాత్రం ఇష్టం లేదు.
ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. ఎందుకంటే సినిమా పరిశ్రమ పై అందులోనూ హీరోయిన్ల జీవితాల పై చాలా రూమర్లు ఉంటాయి. కానీ, సాయి పల్లవికి ఇవేమీ అక్కర్లేదు. అందుకే, నచ్చిన కథలను నమ్మకమైన వ్యక్తులతోనే సినిమాలు చేయాలి అని మొదటి సినిమా సమయంలోనే నిర్ణయించుకున్నాను. అందుకేనేమో ఇప్పుడు నన్ను సినిమాల్లోకి వద్దు అని చెప్పినవాళ్లు కూడా నా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు” అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి…