దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఘోర ప్రమాదం నుంచి అదృష్ట వశాత్తు బయటపడ్డారు. ఆయన సొంత కారే ఆయన ప్రాణాలను కాపాడింది.
వివరాల్లోకి వెళ్తే తిరుమల తిరుపతి భక్తి ఛానల్ కు చైర్మన్ గా ఉన్న రాఘవేంద్ర రావు గారు ఛానల్ పనుల్లో ఓ రెండు మూడు రోజులు తిరుపతిలోనే ఉండాల్సి వచ్చింది. అయితే తిరుపతి దేవస్థానం వారు ఇచ్చిన కారులోనే తరచూ తిరిగే రాఘవేంద్ర రావు గారు. అప్పుడప్పుడు తన సొంతకారులో తిరుపతిలో ప్రయాణిస్తూ ఉంటారు. ఆ సమయం లో రాఘవేంద్ర రావుగారి సిబ్బంది దేవస్థానం కారులో రాఘవేంద్ర రావు గారితో పాటు పయనిస్తూ ఉంటారు. అయితే ఇటీవల తిరుపతి ఘాట్ రోడ్ లో రాఘవేంద్ర రావు గారు వెళ్తుండగా ఆయన సిబ్బంది దేవస్థానం వాహనం లో ఆయన ముందు కారులో ప్రయాణం సాగించారు. ఆ సమయం లో దేవస్థానం కారు అదుపు తప్పి ఘోర ప్రమాదానికి గురి కావడం తో అందులో ఉన్న రాఘవేంద్ర రావు గారి సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ కార్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ,రాఘవేంద్ర రావు సన్నిహితులు ఆయనకు ఫోన్ ల మీద ఫోన్ లు చేస్తుండగా తాను క్షేమంగా న్నట్టు ఆ శ్రీనివాసుడే తనని కాపాడినట్టు చెప్పి తన క్షేమ సమాచారాన్ని తన సన్నిహితులకు చేరవేసాడు రాఘవేంద్రరావు.