ఆ బాధ్యతను స్వచ్చందంగా చేపట్టి పోరాడుతున్నారు కొందరు సినీప్రముఖులు. కొత్వాల్ గూడ లో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్ పర్యావరణానికి పెద్ద ముప్పు కాబోతుందని సినీ నటులు రేణూదేశాయ్, శ్రీదివ్య , దర్శకుడు శశికిరణ్ తిక్కా తో పాటు మరికొందరు ప్రముఖులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఏటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా చేపట్టిన ఈ అక్వా మెరైన్ పార్క్ నిర్మాణం ఆపివేయాలంటూ కోర్ట్ ను ఆశ్రయించారు. ఇటువంటి పార్క్ ల నిర్మాణం సింగపూర్ , మలేసియా వంటి దేశాలలో జరిగాయి మన దేశంలో ఎందుకు సాధ్యం కాదని కోర్ట్ ప్రశ్నించింది. అయితే వీటికి సమాధానం గా పిటీషనర్ తరపున న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ ఎటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా ఏర్పాటుచేసే ఈ పార్క్ లతో జలచరాలకు, వన్య ప్రాణులకు నష్టం వాటిల్లుతుందనే వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి, హెచ్ ఎమ్ డీ ఏ లకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ , జస్టిస్ తుకారంజీలు ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుంది.
Also Read:పెళ్లి పై రష్మిక షాకింగ్ కామెంట్స్
ఈ సందర్భంగా పిటీషనర్స్ లో ఒకరైన దర్శకుడు శశికిరణ్ తిక్కా మాట్లాడుతూఃపర్యావరణానికి చేటు చేసే విధంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ పై మేము చేస్తున్న ఈ పోరాటం కు మీ మద్దతు కూడా కావాలి. వేలాది జలచరాల మనుగడ కు ముప్పు వాటిల్లే ఆక్వా మైరైన్ పార్క్ లు పర్యావరణాన్ని దెబ్బ తీస్తాయి. వాటిని ఆహ్లాదం కోసం మనముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా చనిపోతాయి. తరువాత కత్రిమంగా ఏర్పాటు చేసిన లైట్స్ లో వాటి జీవనం అత్యంత బాధాకరంగా మారుతుంది. వేల గ్యాలన్ల నీటితో నడిచే ఈ ఆక్వా పార్క్ లు నీటి సమస్యకు కారణం అవుతాయి. ఇలాంటి పార్క్ ల నిర్మాణం చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అన్నారు.
నటి సద మాట్లాడతూఃఇప్పటికే నగరంలో నీటి సమస్య చాలా పెరుగుతుంది. మూడు వేల గ్యాలన్ల నీటితో నిర్మాణం అయ్యే ఇలాంటి ఆక్వా పార్క్ లు నీటి సమస్య కు కారణం అవుతాయి. సహాజంగా సముద్రాలలో పెరిగే జలచరాలును పట్టి కత్రిమంగా నిర్మాణం అయ్యే ఇలాంటి పార్క్ లలో ఉంచడం వాటి ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. వాటిని పట్టి తెచ్చే ప్రక్రియలోనే చాలా జలచరాలు ప్రాణాలు కోల్పోతాయి.ఇలాంటి పార్క్ లు కాకుడా ఎన్విరాన్ మెంట్ పై అవగాహాన పెంచే పార్క్ లను ఎచ్ ఎమ్ డి ఎ వారు ఏర్పాటు చేస్తే మంచిది అన్నారు.
Also Read:ముగిసిన బీఏసీ..3 రోజులు అసెంబ్లీ సమావేశాలు