పవన్‌ గుర్తొచ్చాడని…టైటిల్‌నే వద్దన్నారా..?

120
cimena title rejesct for pavan's name

టాలీవుడ్ లో ఇప్పటికే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్‌ తో సినిమాలు తీయడానికి, పవన్ తో  కలిసి నటించడానికి ఎంతోమంది క్యూ కడుతున్నారన్న విషయం తెలిసిందే. అయితే పవన్ ను గుర్తు చేసే ఒక క్రేజీ టైటిల్ ను తాను నిర్మిస్తున్న సినిమాకి వద్దు అని సలహా ఇచ్చిన ఒక టాప్ ప్రొడ్యూసర్ కు సంబంధించిన ఒక హాట్ గాసిప్ ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది.

ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ వ్యూస్ వివరాలలోకి వెళితే అనేక భారీ చిత్రాల నిర్మాతగా గుర్తింపు పొందిన నిర్మాత పొట్లూరి వి. ప్రసాద్ ప్రస్తుతం గోపీ చంద్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాకు నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది.  బి. గోపాల్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ చివరిదశలో ఉంది.

నిర్మాత తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని రూపొందించగా కొన్ని ఆర్ధిక సమస్యల వల్ల ఈ సినిమా రిలీజ్ కి సాయం చేసేందుకు రంగంలోకి పీవీపీ దిగినట్లు వార్తలు వస్తున్నాయి. ‘క్షణం’ ‘ఘాజీ’ లాంటి మూవీస్ ని నిర్మించి కాన్సెప్ట్ సినిమాలను తీయడంలో మంచి పేరు సంపాదించుకున్న పివిపి ఇప్పుడు గోపీ చంద్ నటిస్తున్న ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా వ్యవహరిస్తోంది.

ఈసినిమాకు సంబంధించిన సబ్జెక్ట్ పీవీపీ సంస్థకు బాగా నచ్చడంతో రంగంలోకి దిగిన ఈనిర్మాతకు దర్శకుడు బి. గోపాల్ ఈ మూవీకి  ‘ఆరడుగుల బుల్లెట్’ అనే టైటిల్ సూచించినట్లు టాక్. అయితే ఈటైటిల్ పేరు వినగానే పవన్ గుర్తొచ్చేలా ఉంది  కాబట్టి ఈ టైటిల్ కాకుండా  మరొక టైటిల్ ఆలోచించమని పివిపి అధినేత బి. గోపాల్ కు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈవార్తలు నిజమో కాదో తెలియకపోయినా ఒకవైపు చాలామంది యంగ్ హీరోలు పవన్ సినిమాల పాటలలోని చరణాలను టైటిల్స్ గా పెట్టుకుంటూ ఉంటే ఏకంగా పవన్ విశ్వరూపాన్ని గుర్తుకు చేసే ఈ ‘ఆరడుగుల బుల్లెట్’ టైటిల్ ను తిరస్కరించడం ఎవరూ నమ్మలేని వార్తగా మారింది..