ఏపీలోని విశాఖపట్నం వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొననుండగా ఇవాళ నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే 30వ సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సన్నాహకాలపై అధికారులు, మంత్రులతో సమీక్షించనున్నారు చంద్రబాబు. ఈరోజు రాత్రి భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణితో భేటీ కానున్నారు.
నేటి నుంచి 4 రోజుల పాటు వరుసగా వన్ టు వన్ భేటీలు, సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో విశాఖ నుంచి పాల్గొననున్నారు చంద్రబాబు. నవంబర్ 13న భాగస్వామ్య సదస్సుకు తరలివస్తున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీకానున్నారు. ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం’లో పాల్గొననున్నారు. తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.
14న సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం కానుండగా ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరుకానున్న ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.
‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ సెషన్‌లో సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రసంగం ఉండనుంది. సదస్సు నుంచే ఎపిలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీల ప్రారంభంకానుండగా సింగపూర్ కు నేరుగా విమాన సర్వీసులపై ఒప్పందం చేసుకోనున్నారు. 15న జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఉండనున్నాయి.
Also Read:భూటాన్ రాజుతో ప్రధాని మోదీ భేటీ

