- Advertisement -
కీచక సి.ఐ నాగేశ్వర్ రావ్ ని సర్వీస్ నుండి తొలగించింది పోలీస్ శాఖ. ఈ మేరకు కమిషనర్ సీవీ ఆనంద్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు లేఖ రాయగా సీఐని విధుల నుండి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. పోలీస్ శాఖ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
జులై 7 న నల్గొండ జిల్లా, దేవరకొండ కు చెందిన 30 ఏళ్ల మహిళపై ,హైదరాబాద్ వనస్థలిపురంలో అత్యంత దారుణంగా రేప్ చేసి తీవ్రంగా గాయపర్చారు. ఇక అదేరోజు అర్ధరాత్రి ఆ కుటుంబాన్ని చంపాలని ప్రయత్నించారు. బాధితులు సీఐ నుండి తప్పించుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అతడిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.
సెప్టెంబర్ 28 న నాగేశ్వరరావుకు బెయిల్ రాగా ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు సర్వీస్ నుండి తొలగించారు. దీంతో అంతా పోలీసులకు అభినందనలు చెబుతున్నారు.
- Advertisement -