రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మలక్ పేట్ ట్రాఫిక్ CI జ్యోష్ణ విసిరిన ఛాలెంజ్ స్వీకరించి సౌత్ జోన్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తమ బృందం తో కలిసి మొక్కలు నాటారు CI జానకమ్మ.
ఈ సందర్భంగా జానకమ్మ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. మొక్కలు లేకపోతే మనం లేమని మొక్కలు మనకు ప్రాణ వాయువుని అందిస్తుందని ఈ ప్రాణ వాయువు విలువ కరోనా సమయం లో చాలా వరకు అందరికి అర్ధం అయిందన్నారు.మొక్కలు నాటడం వల్ల మనకే కాదు మన ముందు తరాల వారికి ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు.ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ధనలక్ష్మి, CCS ఇన్స్పెక్టర్ మాధవి లత,అబిడ్స్ ఇన్స్పెక్టర్ ఈ ముగ్గురిని ఈ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు.