మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య..

134
Chukka Ramaiah
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం పెద్దల మన్నలను పొందుతు అందరినీ ఆకర్షిస్తు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తుంది. ఈరోజు ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తన పుట్టినరోజు సందర్భంగా విద్యా నగర్ లోని తన నివాసంలో ప్రముఖ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య,కె. రామచంద్రమూర్తితో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

తన 97వ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచి మా కార్యక్రమానికి ప్రోత్సహించిన చుక్కా రామయ్య గారికి ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి, కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -