క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని సీఎం మాట్లాడుతూ ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
ఇక మెదక్ చర్చిలో తెల్లవారుజామున 4.30 నుంచే చర్చిలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చర్చిలో ప్రార్థనలకు క్రిస్టియన్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని చర్చిల్లో అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ గీతాలు అలరిస్తున్నాయి. చర్చిల ముందు క్రిస్మస్ చెట్లు కూడా క్రిస్టియన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక.. నగరంలోని సికింద్రాబాద్‌లో ఉన్న పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని దానవాయిగూడెంలోని చర్చిలోక్రిస్మస్ ప్రార్థనలు జరుగుతున్నాయి.