- Advertisement -
ఆసీస్ స్టార్ ఆటగాడు, హిట్టర్ క్రిస్ లిన్ టీ20 ప్రపంచకప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగకపోవడమే మంచిదని స్పష్టం చేశాడు క్రిస్ లిన్. ఐపీఎల్‌లో ముంబై జట్టు క్రిస్ లిన్‌ను రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.
ఈ ఏడాది ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించేందుకు క్రిస్ లిన్ సిద్ధమవ్వగా కరోనా రూపంలో చెక్ పడింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌తో పాటు టీ20 ప్రపంచకప్ నిర్వహణ సాధ్యం కాదని తెలిపాడు లిన్.
వరల్డ్ కప్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే జట్లకు వసతి, ప్రయాణ సదుపాయాలు కల్పించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద తలనొప్పిగా మారుతుందన్నాడు. క్వారంటైన్, హోటళ్లలో బస, ప్రయాణ సదుపాయాలు కల్పించడం అంత సులువేం కాదని అందుకే టీ20 ప్రపంచకప్ సాధ్యం కాదని తెలిపాడు.
- Advertisement -