అందుకే ప్రభాస్‌ను వదిలేశా..!

671
Choreographer Rakesh master reveals about Prabhas
Choreographer Rakesh master reveals about Prabhas
- Advertisement -

బాహుబలి సినిమాతో హీరో ప్రభాస్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. ప్రభాస్ తీసుకున్న రిస్కుకు, పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలమే దక్కింది. అప్పటి వరకు కేవలం ప్రాంతీయ హీరోగా ఉన్న ప్రభాస్…. బాహుబలి రిలీజ్ తర్వాత నేషనల్ స్టార్‌గా పేరు సంపాదించాడు. బాలీవుడ్‌ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి ప్రభాస్‌కి.. బాహుబలిలో నటనకు ప్రభాస్‌ను తెగ పొగిడేస్తున్నారు. అయితే ప్రభాస్‌కు డాన్స్‌ నేర్పిన గురువు డాన్స్ మాస్టర్ రాకేష్ మాత్రం సంచలన ఆరోపణలు చేశాడు.

pr

ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన రాకేష్ మాస్టర్‌ మనిషి ఎదుగుదల ఎవరినైనా మార్చేస్తుందని అన్నాడు. “ప్రభాస్ సినిమాల్లోకి రాకముందు డాన్స్‌ నేర్పింది తానేనని అన్నాడు. అప్పట్లో కృష్ణంరాజు నాదగ్గరికొచ్చి ప్రభాస్‌కు డాన్స్‌ నేర్పమన్నపుడు.. ప్రభాస్‌ చాలా సన్నగా ఉండేవాడు. ప్రభాస్ ను సొంత బిడ్డగా భావించాను. ప్రభాస్ చాలా మంచి మనిషి. ఈశ్వర్ సినిమాకు ముందు తనకు రావాల్సింది 8 వేల రూపాయల ఫీజు అయితే తనకు 15,000 రూపాయలు ఇచ్చిన గొప్పవ్యక్తి. ఒక కారు కూడా బహుమతిగా కొనిచ్చారు.” అని అన్నాడు.

ప్రభాస్ డాన్స్ నేర్చుకునే రోజుల్లో తానింతవరకు ఎవరి కాళ్లకు నమస్కరించలేదని, కేవలం ఇద్దరి పాదాలకే నమస్కరించానని, ఒకరు సత్యానంద్ అయితే రెండు రాకేష్ మాస్టర్ అని చెప్పేవాడని గుర్తుచేసుకున్నారు. అయితే ఆయన గాయత్రిహిల్స్ కు నివాసం మార్చిన అనంతరం ఆయనను కలుద్దామని శేఖర్ మాస్టర్ తో కలిసి వెళ్లినప్పుడు… ఇంట్లో ఆయన మేనేజర్ ప్రభాస్ శీను ‘మీరెవరు?’ అంటూ అడ్డుకున్నాడని, దీంతో ‘రాకేష్ మాస్టర్ వచ్చారని చెప్పు’ అనడంతో లోపలికెళ్లిన ఆయన చెప్పాడని, వెంటనే ప్రభాస్ అన్నమాటలు తమకు వినిపించాయని, దీంతో వెనుదిరిగామని అన్నారు. ప్రభాస్‌ కమర్షియల్ గా మారిపోయారని అర్థమైన తరువాత ఇంకెప్పుడూ ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని, మనం విద్య నేర్పించడం వరకే తప్ప అంతకు ముందుకెళ్లకూడదని రూఢీ అయిందని ఆయన చెప్పారు.

- Advertisement -